కల్లు తాగిన 30 మందికి అస్వస్థత

కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన జిల్లా కేంద్రం మెదక్‌లో చోటుచేసుకుంది. పట్టణ పరిధి అవుసులపల్లిలోని ఓ కల్లు దుకాణంలో శుక్రవారం రాత్రి కల్లు తాగిన 30 మంది

Published : 31 Oct 2021 05:08 IST

మెదక్‌లో ఘటన

మెదక్‌, న్యూస్‌టుడే: కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన జిల్లా కేంద్రం మెదక్‌లో చోటుచేసుకుంది. పట్టణ పరిధి అవుసులపల్లిలోని ఓ కల్లు దుకాణంలో శుక్రవారం రాత్రి కల్లు తాగిన 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పలువురికి నోరు వంకర తిరగ్గా మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు. వారిని కుటుంబీకులు శనివారం మెదక్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కల్లు దుకాణ నిర్వాహకులు అందులో కలిపే పదార్థాల వల్లే అస్వస్థతకు గురైనట్లు బాధితులు తెలిపారు. అవుసులపల్లిలో పోలీసులు కట్టడి-ముట్టడి చేపట్టి తనిఖీలు చేయగా ఆ కల్లు దుకాణం నడిపే ఓ వ్యక్తి ఇంట్లో 12 కిలోల డైజోఫామ్‌ లభించింది. ఆ కల్లు దుకాణం నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపిస్తామని ఎక్సైజ్‌ సీఐ గోపాల్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని