విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి

పంట చేలో మిరపతోటకు నీరు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ మహిళారైతు మరణించారు. ఈ విషాద ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం

Published : 27 Nov 2021 04:06 IST

ఆరుగురు అధికారులపై కేసు నమోదు

కామేపల్లి, న్యూస్‌టుడే: పంట చేలో మిరపతోటకు నీరు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ మహిళారైతు మరణించారు. ఈ విషాద ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పింజరమడుగులో జరిగింది. గ్రామానికి చెందిన ఆలకుంట్ల రమాదేవి(45) మిరప తోటకు కాలువల ద్వారా నీరు అందిస్తున్నారు. పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభం స్టే వైర్‌ను పట్టుకోగా విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు ఆందోళన చేశారు. రూ.5 లక్షలు పరిహారం అందేలా చూస్తామని ఏఈ నారాయణ హామీ ఇచ్చారు. రమాదేవికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి భర్త సత్యం ఫిర్యాదు మేరకు... ఆరుగురు విద్యుత్తుశాఖ అధికారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని