చెంబుకు అతీత శక్తులని మోసం

ఓ చెంబుకు అతీత శక్తులు ఉన్నాయని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న నలుగురిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన బండారి హేమంత్‌ కుమార్‌(28) యూట్యూబ్‌లో చూసి.. ఓ చెంబుకు కొన్ని రసాయనాలు

Updated : 28 Nov 2021 05:22 IST

నలుగురి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న తిరుపతి తూర్పు డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: ఓ చెంబుకు అతీత శక్తులు ఉన్నాయని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న నలుగురిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన బండారి హేమంత్‌ కుమార్‌(28) యూట్యూబ్‌లో చూసి.. ఓ చెంబుకు కొన్ని రసాయనాలు అద్ది బియ్యాన్ని ఆకర్షించేలా తయారు చేశాడు. దానికి అతీత శక్తులు ఉన్నాయని గుంటూరు జిల్లా పెద్ద కాకానికి చెందిన షేక్‌ యాషిన్‌ను నమ్మించాడు. దీంతో యాషిన్‌ దాన్ని కొనేందుకు స్నేహితుడితో తిరుపతికి వచ్చారు. హేమంత్‌ కుమార్‌ తన స్నేహితులైన సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌ (34), ఎర్రమిట్ట నివాసి ఆర్కాట్‌ విజయ్‌ కుమార్‌ (44), సత్యనారాయణపురం సర్కిల్‌లోని బిర్ల నాగరాజు(34)తో కలిసి ఆ నల్ల రంగు చెంబును చూపించారు. చెంబు కొనేందుకు షేక్‌ యాషిన్‌ వారికి రూ.1.54 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చారు. ఆ తర్వాత దానికి ఎలాంటి శక్తులు లేవని తెలుసుకున్న యాషిన్‌ అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి.. సీఐ దేవేంద్రకుమార్‌, ఎస్‌ఐ జయచంద్ర ఆధ్వర్యంలోని బృందం శనివారం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది. నిందితులు రైసు పుల్లింగ్‌ పేరుతో మోసం చేస్తూ నగదు కాజేసినట్లు విచారణలో అంగీకరించారని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.1.54 లక్షల నగదు, చెంబు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు