చలానాలు చెల్లించాలన్నందుకు వాహనానికి నిప్పు పెట్టుకున్నాడు

చలానాలు చెల్లించాలన్నందుకు ద్విచక్ర వాహనానికి ఓ వ్యక్తి నిప్పు పెట్టుకున్న ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. శనివారం ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీ చేస్తుండగా.. షేక్‌ మగ్బూల్‌కు చెందిన ద్విచక్ర వాహనం(ఏపీ 01 హెచ్‌ 8085)ను ఆపారు. దానిపై రూ.1,200 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించారు.

Updated : 28 Nov 2021 05:36 IST

చలానాలు చెల్లించాలన్నందుకు ద్విచక్ర వాహనానికి ఓ వ్యక్తి నిప్పు పెట్టుకున్న ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. శనివారం ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీ చేస్తుండగా.. షేక్‌ మగ్బూల్‌కు చెందిన ద్విచక్ర వాహనం(ఏపీ 01 హెచ్‌ 8085)ను ఆపారు. దానిపై రూ.1,200 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించారు. ఆర్సీ చూపించాలని, చలానాలను చెల్లించాలని చెప్పారు. వారితో షేక్‌ మక్బూల్‌, అతని స్నేహితుడు షేక్‌ ఫరీద్‌ వాగ్వాదానికి దిగారు. ఇటీవలే రూ.1,000 జరిమానా చెల్లించానని, మళ్లీ అడుగుతున్నారని ఆగ్రహానికి గురైన మక్బూల్‌ వాహనంపై పెట్రోల్‌ చల్లి నిప్పు పెట్టాడు. పోలీసులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ దుర్భాషలాడినందుకు మక్బూల్‌, ఫరీద్‌లపై కేసు నమోదు చేశారు. కాగా, ఈ వాహనం రవాణా శాఖలో మెస్రం మారుతి పేరిట నమోదై ఉంది.

- న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ నేరవిభాగం, ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని