Published : 30/11/2021 05:10 IST

రాంకీ పంపుహౌస్‌లో ఇద్దరు కార్మికుల దుర్మరణం

విషవాయువుల విడుదలే కారణం

పరవాడ, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో రాంకీ సంస్థకు చెందిన ఇంటర్మీడియట్‌ ఎఫ్లియంట్‌ పంపుహౌస్‌లో విషవాయువులు విడుదలై ఇద్దరు ఒప్పంద కార్మికులు మృతి చెందడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పరవాడ పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణం సీతారాంపురం గ్రామానికి చెందిన అన్నంరెడ్డి దుర్గాప్రసాద్‌ (21), విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన పెదిరెడ్డి మణికంఠ (22)  కొంత కాలంగా పంపుహౌస్‌లో ఆపరేటర్లు (ఒప్పంద)గా  పనిచేస్తున్నారు. వీరిద్దరు స్నేహితులు. ఆదివారం రాత్రి విధులకు హాజరయ్యారు. పంపుహౌస్‌లో దుర్గాప్రసాద్‌ వాల్వును తిప్పుతుండగా ఒక్కసారిగా  ఘాటైన రసాయన విష వాయువులు విడుదలయ్యాయి. వాటిని పీల్చడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మణికంఠ అతన్ని రక్షించే ప్రయత్నం చేయగా గదిలో వ్యాపించి  ఉన్న వాయువులను పీల్చి అస్వస్థతకు లోనై  కుప్పకూలిపోయాడు. సంస్థ ప్రతినిధులు వారిద్దరినీ  విశాఖలోని ప్రైవేటు  ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని