బంగారం అక్రమ రవాణాలో హైదరాబాదీ అరెస్టు

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారాన్ని నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నందుకు హైదరాబాద్‌కు చెందిన సంజయ్‌ అగర్వాల్‌ అనే వ్యాపారిని అరెస్ట్‌ చేసినట్లు..

Published : 30 Nov 2021 05:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారాన్ని నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నందుకు హైదరాబాద్‌కు చెందిన సంజయ్‌ అగర్వాల్‌ అనే వ్యాపారిని అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుర్తింపు పొందిన సంస్థల ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారాన్ని నగిషీల అనంతరం తిరిగి విదేశాల్లోనే అమ్మాలనేది నిబంధన. సంజయ్‌ మాత్రం ఇక్కడే అమ్మేవాడు. దీనిపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయగా కోల్‌కతా న్యాయస్థానం గత ఏప్రిల్‌లో నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది. పుణె సమీపంలోని లోనావాలా, అంబివ్యాలీలో జరుగుతున్న ఓ వివాహానికి సంజయ్‌ హాజరుకాగా ఈడీ అధికారులు కాపుకాసి పట్టుకున్నారు. అతనికి కోల్‌కతా న్యాయస్థానం 7రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది.  నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.25.25 కోట్ల విలువైన 54 కిలోల బంగారం, మూడు స్థిరాస్తులు జప్తు చేయడంతోపాటు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.56 లక్షలను గతంలోనే స్తంభింపజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని