ఆహార పదార్థాల మాటున బంగారం స్మగ్లింగ్‌

విమానాల్లో ఆహారపదార్థాల మాటున బంగారాన్ని దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రట్టు చేశారు.

Published : 30 Nov 2021 05:21 IST

రూ.1.09 కోట్ల విలువైన స్వర్ణం స్వాధీనం..ఒకరి అరెస్టు


స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లు

ఈనాడు, హైదరాబాద్‌: విమానాల్లో ఆహారపదార్థాల మాటున బంగారాన్ని దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రట్టు చేశారు. ఒకర్ని ఆరెస్టు చేశారు. డీఆర్‌ఐ కథనం ప్రకారం..నిఘా వర్గాల సమాచారం మేరకు నగరానికి చెందిన ఓ వ్యక్తిని ఎయిర్‌పోర్టు సమీపంలో శనివారం డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఒక్కోటి కిలో చొప్పున ఉన్న రెండు బంగారం బిస్కెట్లు, ఒక్కోటి 100 గ్రాముల బరువున్న ఉన్న బంగారు రేకులుండగా(విలువ రూ.1.09 కోట్లు) స్వాధీనం చేసుకున్నారు. విచారణలో బంగారం విదేశాల నుంచి దిగుమతి అయినట్లు తేల్చారు. పట్టుబడిన వ్యక్తి విమానాల్లో ఆహార పదార్థాలు సరఫరాచేసే విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. ‘గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే విమానాల్లో ఆహార పదార్థాల ట్రేల మాటున దళారులు బంగారం పంపుతుంటారు. నిందితుడు ఆ ట్రేలలో అమర్చిన బంగారాన్ని రహస్యంగా బయటకు తీసుకొచ్చేవాడని’ దర్యాప్తు అధికారులు వెల్లడించారు. నిందితుడ్ని అరెస్టు చేసినట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని