Published : 30/11/2021 05:21 IST

ఆన్‌లైన్‌ పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌ బుకీల అరెస్ట్‌

రూ.2 కోట్ల నగదు స్వాధీనం

బెట్టింగ్‌ ముఠా వివరాలను వెల్లడిస్తున్న వరంగల్‌ పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి

చిత్రంలో నిందితులతో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: ముంబయి కేంద్రంగా ఆన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌, పేకాట బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి వెల్లడించారు. మహారాష్ట్రలోని యవత్‌మాల్‌ జిల్లా వాని గ్రామానికి చెందిన అభయ్‌ విలాస్‌రావుపేట్కర్‌, హనుమకొండ గోపాల్‌పూర్‌కు చెందిన మాడిశెట్టి ప్రసాద్‌ కలిసి ఆన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌, పేకాట బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. దీనిపై కేయూ పోలీసులకు సమాచారం అందడంతో నిందితులను పట్టుకొని వారి నుంచి రూ.2.05 కోట్ల నగదు, 8 సెల్‌ఫోన్లు, 43 బ్యాంక్‌ చెక్కుబుక్కులు, 15 డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మాడిశెట్టి ప్రసాద్‌ తెలుగు రాష్ట్రాల కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తూ ఐపీఎల్‌, ఇతర క్రికెట్‌ మ్యాచ్‌ల సమయంలో పలువురితో ఆన్‌లైన్లో బెట్టింగ్‌లు పెట్టించి ఆడించేవాడు. గతంలో ప్రసాద్‌ను హైదరాబాద్‌ పోలీసులు బెట్టింగ్‌ కేసులో అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై విడుదలైన ఆయన హైదరాబాద్‌లో అయితే పోలీసులు గుర్తిస్తారని అక్కడి నుంచి హనుమకొండకు మకాం మార్చి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో జులై నుంచి అతనిపై హనుమకొండ డివిజన్‌ కేయూ ఠాణాలో రెండు, హనుమకొండ ఠాణాలో ఒక కేసు నమోదైంది. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ పేకాటలో వచ్చిన లాభాల్లో ప్రసాద్‌ 20 శాతం, ముంబయి నిర్వాహకులు 80 శాతం తీసుకునేవారన్నారు. ముఠాలోని ఇతర నిందితులను పట్టుకునేందుకు ముంబయికి ప్రత్యేక బృందం వెళ్లిందని సీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని