Updated : 01/12/2021 05:58 IST

బిల్లు కావాలంటే.. రూ.లక్ష ఇవ్వాల్సిందే

పెద్దపల్లి ఆర్డీవో, రామగుండం నగరపాలక ఇన్‌ఛార్జి కమిషనర్‌ చేతివాటం

 పట్టుకున్న అనిశా

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: అవినీతి నిరోధక శాఖ(అనిశా) వలలో మరో పెద్దచేప పడింది. పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్‌ అధికారి, రామగుండం నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌ శంకర్‌కుమార్‌ మంగళవారం రూ.లక్ష లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కారు. అనిశా కరీంనగర్‌ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన గుత్తేదారు గైక్వాడ్‌ రజనీకాంత్‌, గతేడాది కరోనా సమయంలో రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేసే పనిచేశారు. దానికి సంబంధించి రూ.9,28,796 బిల్లులు రావాల్సి ఉంది. ఆ సొమ్ము కోసం ఏడాదిగా నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రామగుండం నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్‌ కొద్దినెలల కిందటే బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట రజనీకాంత్‌ ఆర్డీవోను కలిశారు. రూ.లక్ష ఇస్తేనే బిల్లు మంజూరుచేస్తానని ఆయన స్పష్టం చేయడంతో అనిశాను ఆశ్రయించారు. అనిశా అధికారుల సూచన మేరకు రజనీకాంత్‌ సొమ్ముతో మంగళవారం సాయంత్రం పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్డీవో సూచన మేరకు, ఆయన ఇంట్లో పనిచేసే ప్రైవేటు సహాయకుడు తోట మల్లికార్జున్‌కు రూ.లక్ష అందజేశారు. ఆ మొత్తాన్ని మల్లికార్జున్‌, కార్యాలయంలోనే ఉన్న శంకర్‌కుమార్‌కు అందజేయగా, అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశామని, బుధవారం కరీంనగర్‌ అనిశా కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ భద్రయ్య తెలిపారు. సెప్టెంబరు 4న పెద్దపల్లి జిల్లా ముఖ్యప్రణాళికాధికారి(సీపీవో) వెంకటనారాయణ కూడా రామగుండం నగరపాలక సంస్థ గుత్తేదారు నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కడం గమనార్హం.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని