బీట్‌ అధికారులపై దాడి!

అటవీ భూమిని ట్రాక్టర్లతో చదును చేస్తున్నారన్న సమాచారంతో అడ్డుకునేందుకు వెళ్లిన బీట్‌ అధికారులపై దాడిచేసిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముంబోజిపేట తండాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.

Published : 01 Dec 2021 05:03 IST

గాయపడ్డ ఫిరోజ్‌ఖాన్‌

లింగంపేట, న్యూస్‌టుడే: అటవీ భూమిని ట్రాక్టర్లతో చదును చేస్తున్నారన్న సమాచారంతో అడ్డుకునేందుకు వెళ్లిన బీట్‌ అధికారులపై దాడిచేసిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముంబోజిపేట తండాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబోజిపేట శివారులోని 801 కంపార్టుమెంట్‌లో గ్రామానికి చెందిన వడ్డె హన్మంత్‌, తండా వాసి గణేశ్‌తో పాటు పలువురు అటవీ ప్రాంతంలో ట్రాక్టర్లతో భూమిని చదును చేస్తున్నారు.  బీట్‌ అధికారులు ఫిరోజ్‌ఖాన్‌, మహేశ్‌ ఆ ప్రదేశానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. వీరి రాకను గమనించి.. ట్రాక్టర్లను తండాలోకి వేగంగా తీసుకెళ్తుండడంతో బీట్‌ అధికారులు వెంబడించారు. ఈ క్రమంలో అదుపుతప్పి ఓ ట్రాక్టర్‌ బోల్తాపడింది. డ్రైవర్‌కు ఏమైనా జరిగిందా అని చూసేందుకు వెళ్లిన అధికారులపై హన్మంత్‌, గణేశ్‌ కర్రలతో దాడిచేశారు. మహేశ్‌ తప్పించుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే లోపు వాళ్లు ఫిరోజ్‌ఖాన్‌ను తీవ్రంగా కొట్టినట్లు ఎస్సై తెలిపారు. క్షతగాత్రుడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని