Published : 03/12/2021 04:40 IST

నంది గ్రెయిన్‌, ఎస్‌పీవై ఆగ్రో సంస్థలపై సీబీఐ కేసు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాను  మోసగించారని అభియోగాలు

ఈనాడు, అమరావతి: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారన్న అభియోగాలపై నంది గ్రెయిన్‌ డెరివేటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌పీవై  ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. వాటి డైరెక్టర్లు, ప్రతినిధులైన వి.సురేష్‌కుమార్‌శాస్త్రి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, వి.శశిరెడ్డితో పాటు వివరాలు తెలియని కొంతమంది ప్రభుత్వోద్యోగులు, ప్రైవేటు వ్యక్తులను నిందితులుగా చేర్చింది. ఐపీసీలోని 120బీ రెడ్‌విత్‌ 420, 468, 471 సెక్షన్‌లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2)  రెడ్‌విత్‌ 13(1)(డీ) కింద కేసు పెట్టింది. ‘హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి నిందితులు కంపెనీ పేరుతో రుణాలు తీసుకున్నారు. వాటిని వ్యక్తిగత లబ్ధికి మళ్లించుకున్నారు. ఆ అక్రమాలు కప్పిపుచ్చేందుకు బ్యాంకుకు తప్పుడు  స్టాక్‌ స్టేట్‌మెంట్లు సమర్పించారు. ఉద్దేశపూర్వకంగానే బ్యాంకుకు రుణ చెల్లింపులు నిలిపేసి డిఫాల్టర్‌ అయ్యారు. అంతా కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. బ్యాంక్‌కు రూ.61.86 కోట్ల మేర నష్టం కలిగించారు’ అంటూ అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించింది. ఫోర్జరీ, మోసం, తప్పుడు డాక్యుమెంట్ల సమర్పణ తదితర అభియోగాల్ని మోపింది.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని