
Updated : 03 Dec 2021 06:47 IST
Crime News: యువకుడి కడుపులో బంగారు ఉండలు..!
అరెస్టు చేసిన కోయంబత్తూరు విమానాశ్రయం అధికారులు
అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం ఉండలు
కోయంబత్తూరు, న్యూస్‌టుడే: ఓ ప్రయాణికుడి కడుపులో ఉండలు లాంటివి ఉన్నట్లు గుర్తించి వైద్యుల సాయంతో బయటకు తీయగా.. వాటిలో పేస్టు రూపంలోని బంగారం దాచినట్లు బయటపడింది. తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయానికి గురువారం ఉదయం షార్జా నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. అతడిని స్కాన్ చేయగా కడుపులో 3 ఉండలు ఉన్నట్లు తెలిసింది. వాటిల్లో పేస్టు చేసిన బంగారం ఉంచి తరలిస్తున్నట్లు గుర్తించి వైద్యుడి సాయంతో బయటకు తీయించారు. ఈ ఘటనలో సుమారు రూ.32 లక్షల విలువైన 640 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణకు పాల్పడిన ఆ యువకుడిని అరెస్టు చేశారు.
Tags :