Published : 03/12/2021 04:54 IST

కలుషిత నీరు తాగి వృద్ధురాలి మృతి

23 మందికి అస్వస్థత
వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఘటన

మృతురాలు బసమ్మ

తాండూరు, న్యూస్‌టుడే: కలుషిత నీరు తాగి ఓ వృద్ధురాలు మృతి చెందింది. మరో 23 మంది అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని పాత తాండూరు కోటేశ్వర దేవాలయం పరిసరాల్లో నివాసముంటున్న వారు బుధవారం నల్లా నీటిని పట్టుకుని వంటలకు, తాగడానికి వినియోగించారు. సాయంత్రం నుంచి వాంతులు, విరేచనాలు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. వారిలో రెండేళ్ల నుంచి పదేళ్ల లోపు పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వారిని తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేయగా.. కొందరు గురువారానికి స్వల్పంగా కోలుకున్నారు. బసమ్మ(65) అనే వృద్ధురాలిని గురువారం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందారు. ఎనిమిది నెలల చిన్నారి సీజనమ్‌తోపాటు కిష్టప్ప, అమీర్‌బేగ్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ముగ్గురితోపాటు మిగిలిన వారు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆసుపత్రిలో బాధితులు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అవసరమైతే హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స చేయిస్తామని భరోసా ఇచ్చారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు

ఆ నీటిని తాగడంతోనే.. - డాక్టర్‌ రవిశంకర్‌, సూపరింటెండెంట్‌, జిల్లా ఆసుపత్రి

కలుషిత నీటిని తాగడంతోనే పాత తాండూరు వాసులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో 23 మంది చేరి చికిత్స పొందుతున్నారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారికి మెరుగైన చికిత్సలు అందిస్తాం. ప్రజలు కాచివడపోసిన నీటిని తాగాలి.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని