అప్పుల బాధ భరించలేక యువరైతు బలవన్మరణం

అప్పుల బాధ తాళలేక నల్గొండ జిల్లా అనుముల మండలం వీర్లగడ్డ తండాకు చెందిన ఓ యువ రైతు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై శివకుమార్‌, గ్రామస్థుల వివరాల ప్రకారం... వీర్లగడ్డతండాకు చెందిన బాణోతు లక్ష్మణ్‌(22)

Published : 03 Dec 2021 04:54 IST

హాలియా, న్యూస్‌టుడే: అప్పుల బాధ తాళలేక నల్గొండ జిల్లా అనుముల మండలం వీర్లగడ్డ తండాకు చెందిన ఓ యువ రైతు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై శివకుమార్‌, గ్రామస్థుల వివరాల ప్రకారం... వీర్లగడ్డతండాకు చెందిన బాణోతు లక్ష్మణ్‌(22) డిగ్రీ పూర్తి చేశారు. తనకున్న ఎకరం పొలంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. పంటల సాగుకు గతంలో చేసిన అప్పులకు తోడు ఈ సారి కలిపి మొత్తం రూ.4 లక్షల వరకు అప్పులు అయ్యాయి. ఈ సీజన్‌లో అసలే అంతంతమాత్రం దిగుబడి రాగా.. వచ్చిన దిగుబడికీ మద్దతు ధర లభించలేదు. అప్పులు తీర్చలేనన్న మనస్తాపంతో మంగళవారం రాత్రి పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా  బుధవారం రాత్రి మృతి చెందారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని