బిల్లులు చెల్లించకుండా అవమానించారని మనస్తాపం

తాము చేసిన పనులకు బిల్లులివ్వకుండా అందరిముందూ అవమానించారని నిరసన వ్యక్తం చేస్తూ మహిళా సర్పంచి, ఆమెభర్త పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం చింతలపాలెం మండలం అడ్లూరు సర్పంచి కందుకూరి స్వాతి, ఆమె భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు పిల్లలు ఎంపీడీవో

Published : 05 Dec 2021 05:16 IST

 ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచి దంపతుల ఆత్మహత్యాయత్నం

పెట్రోల్‌ పోసుకుంటున్న వెంకటేశ్వర్లును వారిస్తున్న ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, చిత్రంలో సర్పంచి స్వాతి

చింతలపాలెం, న్యూస్‌టుడే: తాము చేసిన పనులకు బిల్లులివ్వకుండా అందరిముందూ అవమానించారని నిరసన వ్యక్తం చేస్తూ మహిళా సర్పంచి, ఆమెభర్త పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం చింతలపాలెం మండలం అడ్లూరు సర్పంచి కందుకూరి స్వాతి, ఆమె భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు పిల్లలు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. పల్లెప్రగతి వనం, శ్మశానవాటిక పెండింగ్‌ పనులపై నోటీసులు ఇచ్చిన విషయమై ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలోనే పక్క గదిలోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బంది వారిని అడ్డుకున్నారు. మూడురోజుల కిందట నిర్వహించిన ఉపాధి పనుల సోషల్‌ ఆడిట్‌ సమావేశంలో.. శ్మశానవాటిక నిర్మాణ పనులపై ఎంపీడీవో, ఎంపీవో పరోక్షంగా సహచర ప్రజాప్రతినిధుల ముందే తమను అవమానించారని సర్పంచి దంపతులు ఆరోపించారు. పల్లెప్రగతి నాలుగు విడతల పనులకు రూ.4 లక్షల బిల్లులు తమకు రావాల్సి ఉండగా.. తిరిగి పనులు చేయలేదని, పంచాయతీ ట్రాక్టర్ల బీమా ప్రీమియం చెల్లించలేదని నోటీసులు ఇచ్చారన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించామన్నారు. ఎంపీడీవో గ్యామా స్పందిస్తూ విధుల్లో భాగంగా పెండింగ్‌ పనులపై ప్రజాప్రతినిధులందరితో పాటు ఈ సర్పంచికీ నోటీసులు జారీ చేశామన్నారు. అడ్లూరులో శ్మశానవాటికకు రూ.1.90 లక్షల నిధులు విడుదల చేయగా.. పనులు పూర్తి చేయని విషయాన్ని గుర్తు చేశామన్నారు. ట్రాక్టర్ల బీమా ప్రీమియం చెల్లింపు జాప్యంపై ఇతర సర్పంచులకూ మెమోలు ఇచ్చామన్నారు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు