నకిలీ సీబీఐ అధికారుల ముఠా అరెస్టు

సీబీఐ అధికారులమంటూ డబ్బులు వసూలుచేస్తున్న ఒక ముఠాను కడప అర్బన్‌ పోలీసులు అరెస్టుచేశారు. వారినుంచి రూ.84 వేల నగదు, రెండు గుర్తింపు పత్రాలు, కారు స్వాధీనపరచుకున్నారు

Published : 05 Dec 2021 05:23 IST

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: సీబీఐ అధికారులమంటూ డబ్బులు వసూలుచేస్తున్న ఒక ముఠాను కడప అర్బన్‌ పోలీసులు అరెస్టుచేశారు. వారినుంచి రూ.84 వేల నగదు, రెండు గుర్తింపు పత్రాలు, కారు స్వాధీనపరచుకున్నారు. నిందితులను శనివారం డీఎస్పీ వెంకటశివారెడ్డి తన కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. అనంతపురం జిల్లా ఖాజానగర్‌కు చెందిన మాగంటి నగేష్‌, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగరాజుపాడుకు చెందిన పావుకూరి సుందరరామయ్య, కడప రామాంజనేయపురానికి చెందిన వాసం నవీన్‌రాజు, బుక్కే ప్రభాకర్‌నాయక్‌ సీబీఐ అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. నవంబరు 23న ఖాజీపేట మండలం పత్తూరుకు చెందిన బేరి ఉదయ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి సీబీఐ అధికారులమని, విచారణ కోసమని రావాలని చెప్పారు. వెళ్లగానే కారులో ఎక్కించుకుని తిప్పుతూ కొట్టి, బెదిరించి రూ.1.14 లక్షలను ఫోన్‌పే చేయించుకున్నారు. 25న రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడు 27న చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం చెన్నూరు సమీపంలోని కొక్కరాయపల్లె క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కారులో అటుగా వచ్చిన నిందితులు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని