
తుపాకీ మిస్‌ఫైర్
గాయపడిన హెడ్‌కానిస్టేబుల్
చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు మిస్‌ఫైర్ అయిన తుపాకీ
మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో గార్డు విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ గాయపడ్డారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై చిలకలపూడి స్టేషన్లో కేసు నమోదయ్యింది. సీఐ అంకబాబు వివరాల మేరకు.. కలెక్టరేట్లో ఉన్న ఈవీఎంల గోదాముల వద్ద ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ వై.శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం అతని వద్ద ఉన్న తుపాకీని శుభ్రం చేస్తుండగా అది మిస్‌ఫైర్ అయింది. పేలిన తూటా అతని గుండె పక్కగా శరీరంలోకి దూసుకుపోయింది. తుపాకీ పేలిన శబ్దం విని అక్కడే ఉన్న కానిస్టేబుల్ గాయపడ్డ శ్రీనివాసరావును గుర్తించి పై అధికారులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాల కోసం ఎస్పీ సిద్ధార్థ కౌశల్ విచారణకు ఆదేశించారు.
Advertisement