మంత్రి పువ్వాడ పేరిట నకిలీ మెయిల్స్‌..ఫిర్యాదు

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పంపించినట్లుగా టీఎస్‌ఆర్టీసీకి నకిలీ(ఫేక్‌) మెయిల్స్‌ వస్తున్నాయని ఆర్టీసీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ సోమవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం

Published : 07 Dec 2021 04:36 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పంపించినట్లుగా టీఎస్‌ఆర్టీసీకి నకిలీ(ఫేక్‌) మెయిల్స్‌ వస్తున్నాయని ఆర్టీసీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ సోమవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. ఇటీవల tsrtc.gov.inకు bossdirector8@gmail.com నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పంపించినట్లుగా మెయిల్స్‌ వచ్చాయి. మొదట వచ్చిన మెయిల్‌లో ‘అర్జెంట్‌గా కలవాలి’ అని ఏకవాక్య సందేశం ఉంది. ఆర్టీసీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా.. రూ.50 వేల విలువ చేసే అమెజాన్‌ గిఫ్ట్‌ కూపన్లు పంపించాలని మరో మెయిల్‌ వచ్చింది. దీంతో అనుమానించిన అధికారులు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఇది నైజీరియన్‌ మోసగాళ్ల పని అయిఉండవచ్చని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని