Crime News: ప్రేమ పెళ్లి చేసుకుందని సోదరి తల నరికేశాడు..

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో గర్భిణి అయిన సొంత సోదరిని దారుణంగా హత్య చేశాడు 17 ఏళ్ల ఓ యువకుడు. కొడవలితో శరీరం నుంచి తలను వేరు చేశాడు. అనంతరం దాన్ని పొరుగున ఉన్నవారికి చూపుతూ

Updated : 07 Dec 2021 06:12 IST

 ఆ తర్వాత సెల్ఫీలు దిగాడు

మహారాష్ట్రలో తల్లితో కలసి 17 ఏళ్ల యువకుడి దారుణం

హారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో గర్భిణి అయిన సొంత సోదరిని దారుణంగా హత్య చేశాడు 17 ఏళ్ల ఓ యువకుడు. కొడవలితో శరీరం నుంచి తలను వేరు చేశాడు. అనంతరం దాన్ని పొరుగున ఉన్నవారికి చూపుతూ సెల్ఫీలు దిగాడు. ఈ ఘాతుకానికి కన్నతల్లి కూడా సహకరించింది. ఔరంగాబాద్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గోయేగావ్‌ గ్రామానికి చెందిన 19 ఏళ్ల కృతి.. వైజాపుర్‌లోని లడ్గావ్‌కు చెందిన అవినాశ్‌ థోరేను ప్రేమించింది. ఆరు నెలల క్రితం కృతి ఇంటి నుంచి వెళ్లిపోయి అవినాశ్‌ను పెళ్లి చేసుకుంది. వారు లడ్గావ్‌లో నివాసముంటున్నారు. కొన్ని రోజుల క్రితం కృతి తల్లి ఆమెను కలిసి ఫోన్‌ నంబర్‌ తీసుకుంది. ఆదివారం ఆమె తల్లి, సోదరుడు లడ్గావ్‌లోని ఇంటికి వెళ్లారు. టీ పెట్టడానికి కృతి వంటగదిలోకి వెళ్లింది. ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్న ఆమె భర్త వేరే గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా కృతి సోదరుడు ఒక్కసారిగా కొడవలితో ఆమెపై దాడి చేశాడు. తల్లి కృతి కాళ్లు గట్టిగా పట్టుకోగా సోదరుడు మెడను కోసి తలను వేరుచేశాడు. ఆమె అరుపులకు లేచివచ్చిన కృతి భర్త అక్కడి దృశ్యాన్ని చూసి భయకంపితుడయ్యాడు. అతణ్ని కూడా చంపే యత్నం చేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఆమె తలను బయటకు తెచ్చిన సోదరుడు పొరుగిళ్లలో ఉన్నవారికి చూపిస్తూ సెల్ఫీలు తీసుకున్నాడు. అనంతరం తల్లి, కొడుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని