తాగి విధుల్లోకి ప్రొటోకాల్‌ డ్రైవర్‌

ప్రభుత్వ ప్రొటోకాల్‌ విభాగానికి చెందిన ఓ సీనియర్‌ డ్రైవర్‌ మద్యం తాగి వాహనం నడుపుతూ హోంగార్డును ఢీకొట్టాడు. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది

Published : 08 Dec 2021 04:59 IST

విమానాశ్రయంలో హోంగార్డును ఢీకొట్టడంతో ప్రమాదం
ఉపరాష్ట్రపతి పర్యటన రిహార్సల్స్‌లో అపశ్రుతి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రొటోకాల్‌ విభాగానికి చెందిన ఓ సీనియర్‌ డ్రైవర్‌ మద్యం తాగి వాహనం నడుపుతూ హోంగార్డును ఢీకొట్టాడు. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 9న హైదరాబాద్‌ వస్తున్న నేపథ్యంలో మంగళవారం సైబరాబాద్‌ పోలీసులు, ప్రొటోకాల్‌శాఖ అధికారులు సంయుక్తంగా హైదరాబాద్‌ నుంచి విమానాశ్రయం వరకు రిహార్సల్స్‌ నిర్వహించారు. ప్రొటోకాల్‌ విభాగంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్‌ తాజుద్దీన్‌ కారును అజాగ్రత్తగా నడిపి.. విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్జీఐఏ విభాగం హోంగార్డు అశోక్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన హోంగార్డును అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు శ్వాస విశ్లేషణ పరీక్ష చేయగా బీఏసీ 77 రీడింగ్‌ రావడంతో భద్రతాధికారుల అవాక్కయ్యారు. మద్యం మత్తులో విధులకు హాజరుకావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని