నకిలీ వీసాలతో గల్ఫ్‌ వెళ్లే యత్నం

నకిలీ వీసాలు, ధ్రువీకరణ పత్రాలతో గల్ఫ్‌కు వెళ్లేందుకు యత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. వీరందరూ తెలంగాణ, ఏపీ, గోవా, తమిళనాడు

Published : 08 Dec 2021 04:59 IST

‘శంషాబాద్‌’లో 44 మంది మహిళలను అడ్డుకున్న అధికారులు
పోలీసుల అదుపులో ఇద్దరు సబ్‌ ఏజెంట్లు!

ఈనాడు-హైదరాబాద్‌, శంషాబాద్‌-న్యూస్‌టుడే: నకిలీ వీసాలు, ధ్రువీకరణ పత్రాలతో గల్ఫ్‌కు వెళ్లేందుకు యత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. వీరందరూ తెలంగాణ, ఏపీ, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. వీరికి ఏజెంట్లు జజీరా ఎయిర్‌లైన్స్‌ విమానంలో టికెట్లు బుక్‌ చేశారు. వారు ఇచ్చిన వీసాలు, ధ్రువీకరణ పత్రాలతో మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారి వద్ద విజిటింగ్‌ వీసా, కువైట్‌లో పనిచేసేందుకు ఎంప్లాయిమెంట్‌ వీసాలున్నాయి. విమానాశ్రయంలో ఒక వీసా, కువైట్‌లో అధికారులకు మరొకటి చూపాలని దళారులు చెప్పారని మహిళలు తెలిపారు. వారిని పోలీసులకు అప్పగించారు. 44 మంది మహిళల్లో తెలుగు రాష్ట్రాల్లోని ఉభయగోదావరి, రాయలసీమ, కరీంనగర్‌ జిల్లాలకు చెందినవారు సైతం ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు సబ్‌ ఏజెంట్ల ద్వారా ముంబయిలోని ప్రధాన ఏజెంటు ఈ దందా సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని