Published : 08/12/2021 04:59 IST

అనుమానాస్పద స్థితిలో వీఆర్‌ఏ మృతి

ఇసుక అక్రమ రవాణాదారులు దాడి చేశారని భార్య ఫిర్యాదు

బోధన్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం ఖండ్‌గావ్‌ గ్రామ వీఆర్‌ఏ గౌతమ్‌(37) మృతి కలకలం రేపింది. ఇసుక అక్రమ రవాణాదారులు తన భర్తను హత్య చేశారని గౌతమ్‌ భార్య మహానంది.. మంగళవారం బోధన్‌ గ్రామీణ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇసుక రవాణాపై నిఘా విధుల్లో ఉన్న తన భర్తను సోమవారం రాత్రి సాహెబ్‌రావు, అవినాష్‌, గంగాధర్‌ అనే వ్యక్తులు కొట్టారని పేర్కొన్నారు. దీంతో అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన గౌతమ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని తెలిపారు. ఘటనను నిరసిస్తూ మంగళవారం ఉదయం వీఆర్‌ఏల సంఘం ప్రతినిధులు, ఆయన కుటుంబసభ్యులు ఠాణాకు తరలివచ్చారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పగా హత్య కేసు పెట్టాలని పట్టుబట్టారు. జిల్లా పోలీసు కమిషనరేట్‌ డీసీపీ అరవింద్‌బాబు, ఏసీపీ రామారావులు స్టేషన్‌కు వచ్చి వీఆర్‌ఏ కుటుంబసభ్యులతో మాట్లాడారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు. సోమవారం రాత్రి గౌతమ్‌కు ఇసుక రవాణా కాపలా విధులు అప్పగించలేదని తహసీల్దార్‌ గఫార్‌మియా చెప్పగా.. గ్రామంలో చోటుచేసుకున్న మరో ఘటన వీఆర్‌ఏ మృతికి కారణం అయిఉంటుందన్న అనుమానం ఉందని ఏసీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని