Published : 08/12/2021 04:59 IST

సాగర్‌ కాల్వలో పడి ముగ్గురి గల్లంతు

ఒకరి మృతదేహం లభ్యం

ముదిగొండ, న్యూస్‌టుడే: యంత్రంతో వరి కోతలు కోసేందుకు వచ్చిన ముగ్గురు పంజాబ్‌ వాసులు ప్రమాదవశాత్తు నాగార్జున సాగర్‌ కాల్వలో పడి గల్లంతయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరులో చోటుచేసుకుంది. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన మనిందర్‌ కుమార్‌(28), గురునామ్‌చంద్‌(32), సాజన్‌(19) ఆగస్టు నెలలో వరికోత మిషన్‌ ఆపరేటర్‌, డ్రైవర్‌, హెల్పర్‌గా పని చేసేందుకు నిజామాబాద్‌ జిల్లాలోని ఓ వరికోత యంత్రం యజమాని వద్ద చేరారు. పన్నెండు రోజుల కిందట అక్కడి నుంచి మేడేపల్లి, కట్టకూరులో వరి కోతలు కోయడానికి ఆరుగురు వచ్చారు. సోమవారం రాత్రి కోతలు పూర్తయిన అనంతరం ముగ్గురు బహిర్భుమికి వెళ్లారు. ఎంతసేపటికీ వారు రాకపోవడంతో గ్రామస్థుల సాయంతో వెతకగా సాగర్‌ కాల్వ కట్టపై ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్లు, చెప్పులు లభించాయి. దీంతో స్థానికులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. వారు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా ఘటనా స్థలానికి 200 మీటర్ల దూరంలో మనిందర్‌ కుమార్‌ మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి కోసం రాత్రి వరకు వెతికి చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని