Updated : 08 Dec 2021 07:31 IST

Crime News: కామారెడ్డిలో అడ్డా కూలీపై హత్యాచారం

అత్యాచారం చేసి గొంతుకు చున్నీ బిగించి దారుణం
పోలీసుల అదుపులో నిందితుడు

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: అడ్డా కూలీగా పని చేసుకొని జీవనం సాగించే ఓ గిరిజన మహిళ హత్యాచారానికి గురైన దారుణ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులో మంగళవారం వెలుగు చూసింది. కామారెడ్డి గ్రామీణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ తండాకు చెందిన మహిళ(32) కొన్నాళ్లుగా స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో జిల్లా కేంద్రంలో అడ్డా కూలీగా పనిచేసేవారు. నవంబరు 17న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన ఆమె భర్త 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. లింగంపేట మండలం పర్మళ్ల తండాకు చెందిన ప్రకాశ్‌తో ఆమెకు పరిచయమున్నట్లు విచారణలో తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకొని కామారెడ్డి శివారులోని లింగాపూర్‌ పరిధిలో ఆ మహిళ మృతదేహాన్ని చూపించాడు. పనికోసమంటూ ఆ మహిళను ద్విచక్రవాహనంపై తీసుకొచ్చి మద్యం తాగించి అత్యాచారం చేశానని.. అనంతరం గొంతుకు చున్నీ బిగించి హత్య చేసినట్లు తెలిపాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని