వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి తండ్రీకుమారుల దుర్మరణం

వేటకు వెళ్లి అదే జంతువుల కోసం అమర్చిన విద్యుత్‌ తీగలు తగలడంతో తండ్రీకొడుకులు మృత్యువాత పడ్డారు.  ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. దమ్మపేట మండలం రంగువారిగూడేనికి చెందిన

Published : 08 Dec 2021 04:59 IST

దమ్మపేట, న్యూస్‌టుడే: వేటకు వెళ్లి అదే జంతువుల కోసం అమర్చిన విద్యుత్‌ తీగలు తగలడంతో తండ్రీకొడుకులు మృత్యువాత పడ్డారు.  ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. దమ్మపేట మండలం రంగువారిగూడేనికి చెందిన పొద్దుటూరి దానియేల్‌(45), కుమారుడు రాకేశ్‌(22), సోదరుడు విజయ్‌కుమార్‌లతో కలసి సోమవారం రాత్రి గ్రామ శివారులోని అటవీప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న మామిడి తోటలో జంతువుల కోసం విద్యుత్‌ తీగలను అమర్చారు. రాకేశ్‌ ఈ తీగల్ని తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుమారుడిని కాపాడుకోవాలనే తాపత్రయంతో దానియేల్‌ అతన్ని పట్టుకోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. వారిని కాపాడాలనేయత్నంలో విజయ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి.  మృతుడి భార్య సుజాత ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని