Published : 09/12/2021 05:52 IST

ముగ్గురి ప్రాణాలను బలిగొన్న నిద్రమత్తు

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు
మృతుల్లో తిరుపతి వేద విశ్వవిద్యాలయం ఆచార్యుడు

సంఘటన స్థలంలో కారు, లారీ

గుడ్లూరు, న్యూస్‌టుడే: అతివేగం, నిద్రమత్తు మూడు ప్రాణాల్ని బలిగొంది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన ఘటన ప్రకాశం జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదంలో అగ్నిహోత్రం శ్రీనివాసా చార్యులు (59), ఆయన భార్య రాజ్యలక్ష్మి (54), కారు డ్రైవర్‌ పురుషోత్తం (26) మరణించారు. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేస్తున్న శ్రీనివాసాచార్యులు భార్యతో కలిసి కారులో తెలంగాణలోని ఖమ్మం వెళుతున్నారు. ఉదయం 8.40 గంటల సమయంలో గుడ్లూరు మండలం చేవూరు వద్దకు చేరేసరికి నిద్రమత్తులో ఉన్న డ్రైవర్‌ పురుషోత్తం రహదారి పక్కన ఆగిఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ముందు సీట్లలోని శ్రీనివాసాచార్యులు, పురుషోత్తం అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన రాజ్యలక్ష్మిని 108 వాహనంలో కావలి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. శ్రీనివాసాచార్యులుకు వైఖానస ఆగమంలో ఉద్దండ పండితుడిగా గుర్తింపు ఉంది. ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని జమిదింటకుర్రు. ద్వారకా తిరుమలలోని వేద పాఠశాలలో రెండు దశాబ్దాలు ప్రిన్సిపల్‌గా పని చేశారు. దశాబ్దకాలంగా తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. ఉపకులపతి పోస్టుకు శ్రీనివాసాచార్యులు దరఖాస్తు చేసుకున్నారని, ఇంతలోనే ప్రమాదంలో చనిపోయారంటూ బంధువులు, కుటుంబసభ్యులు రోదించారు.

రాజ్యలక్ష్మి, అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని