TS News: ఉద్యోగినిపై తహసీల్దార్‌ అనుచిత ప్రవర్తన.. సరెండర్‌ చేసిన కలెక్టర్‌

రెవెన్యూ ఉద్యోగినిపై అనుచితంగా ప్రవర్తించిన యాదాద్రి జిల్లా గుండాల తహసీల్దార్‌ ఉల్ఫాల దయాకర్‌రెడ్డిని సీసీఎల్‌ఏ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ పమేలా సత్పతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పనులు పెండింగ్‌లో లేకున్నా రాత్రి, పగలు తేడా లేకుండా మూడు

Published : 12 Dec 2021 08:02 IST

గుండాల, న్యూస్‌టుడే: రెవెన్యూ ఉద్యోగినిపై అనుచితంగా ప్రవర్తించిన యాదాద్రి జిల్లా గుండాల తహసీల్దార్‌ ఉల్ఫాల దయాకర్‌రెడ్డిని సీసీఎల్‌ఏ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ పమేలా సత్పతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పనులు పెండింగ్‌లో లేకున్నా రాత్రి, పగలు తేడా లేకుండా మూడు, నాలుగు నెలల నుంచి గుండాల తహసీల్దారు దయాకర్‌రెడ్డి తనకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని,  దూషిస్తున్నారని అదే కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగి ఈ నెల 8న కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తనలో మార్పు కోసం ఎదురుచూసి విసిగిపోయి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌ శనివారం ఉదయం నిందితుణ్ని  హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయానికి సరెండర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని