సవ్యంగా సాగే కాపురంలో కలతలు.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి బలవన్మరణం

వారిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. సవ్యంగా సాగే కాపురంలో కలతలు ప్రారంభమయ్యాయి. ఇక భర్త అనుమానాలు..వేధింపులు భరించలేనంటూ గోడపై రాసి భార్య ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Updated : 12 Dec 2021 06:44 IST

భర్త వేధింపులే కారణం
రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో విషాదం

ఈనాడు, హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: వారిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. సవ్యంగా సాగే కాపురంలో కలతలు ప్రారంభమయ్యాయి. ఇక భర్త అనుమానాలు..వేధింపులు భరించలేనంటూ గోడపై రాసి భార్య ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఫోర్ట్యువ్యూ కాలనీలో శనివారం గృహిణి స్వాతి కుసుమ (32).. తన పిల్లలు తన్విక్‌(4), శ్రేయ(3)లను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నారు. భార్యభర్తలిద్దరూ మాదాపూర్‌లోని ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేసేవారు. భార్య గర్భం దాల్చటంతో ఉద్యోగం మాన్పించాడు. అనంతరం అత్తవారింట గొడవల కారణంగా.. స్వాతి తల్లిదండ్రులు వారిని రాజేంద్రనగర్‌లోని ఫోర్టు వ్యూకాలనీకి మకాం మార్పించారు.

కొద్దికాలంగా దంపతుల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి విధులకు వెళ్లిన సాయికుమార్‌ శనివారం ఉదయం 5 గంటలకు ఇంటికి వచ్చి హాలులోని సోఫాలో నిద్రపోయాడు. సాయంత్రం నిద్రలేచి పడకగదిలో ఉన్న భార్య, పిల్లల్ని పిలిచినా వారి నుంచి స్పందన రాకపోవటంతో తలుపులు పగులకొట్టినట్టు సాయికుమార్‌ పోలీసులకు తెలిపాడు. అప్పటికే భార్య, పిల్లలు మరణించి ఉన్నారని వివరించాడు. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతడు ఇంట్లోనే ఉన్నాడని  స్వాతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాయికుమార్‌ ఓ మహిళతో సన్నిహితంగా మెలగడం కూడా దంపతుల మధ్య విభేదాలకు కారణమని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని