Crime News: 19 ఏళ్ల యువకుడు.. మూడు హత్యలు

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో గత మంగళవారం అర్ధరాత్రి ముగ్గురిని కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు 19 ఏళ్ల  యువకుడని, మద్యం మత్తులో నగదు కోసం హతమార్చాడని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డిచ్‌పల్లిలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న హార్వెస్టర్‌ షెడ్డులో హర్పాల్‌సింగ్‌, జోగిందర్‌సింగ్‌, సునీల్‌ దారుణహత్యకు గురికాగా.. డిచ్‌పల్లి పోలీసులు అనేక

Updated : 13 Dec 2021 09:45 IST

డిచ్‌పల్లి కేసులో నిందితుడి అరెస్ట్‌
తాగిన మైకంలో నగదు కోసం దారుణం

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నేరవార్తలు: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో గత మంగళవారం అర్ధరాత్రి ముగ్గురిని కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు 19 ఏళ్ల  యువకుడని, మద్యం మత్తులో నగదు కోసం హతమార్చాడని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డిచ్‌పల్లిలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న హార్వెస్టర్‌ షెడ్డులో హర్పాల్‌సింగ్‌, జోగిందర్‌సింగ్‌, సునీల్‌ దారుణహత్యకు గురికాగా.. డిచ్‌పల్లి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిజామాబాద్‌ ఖిల్లా చౌరస్తాలో నివసిస్తున్న 19 ఏళ్ల గంధం శ్రీకాంత్‌ని హంతకుడిగా గుర్తించారు. 15 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలకు అలవాటు పడిన శ్రీకాంత్‌.. ఆ రోజు మద్యం మత్తులో నగదు కోసం ఆ షెడ్డు వద్దకు వెళ్లాడు. తొలుత బయట మంచంపై నిద్రిస్తున్న సునీల్‌ తలపై సుత్తితో దాడి చేసి చంపేశాడు. అక్కడే షెడ్డులో మద్యం సీసా కనిపించడంతో తాగాడు. తర్వాత హర్పాల్‌సింగ్‌, జోగిందర్‌సింగ్‌లపై వరుసగా సుత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం వారి సెల్‌ఫోన్లు, రూ.2,800 నగదు అపహరించుకెళ్లాడు. మృతులు ముగ్గురూ మద్యం తాగి గాఢనిద్రలో ఉండడంతో శ్రీకాంత్‌కు ఎక్కడా ప్రతిఘటన ఎదురుకాలేదని పోలీసులు వర్గాలు తెలిపాయి.

సెల్‌ఫోన్‌లో సిమ్‌ వేసి..

ఆ సెల్‌ఫోన్లలో సిమ్‌లను తీసేసిన నిందితుడు.. తర్వాత అందులో ఒక ఫోన్‌లో తన సిమ్‌కార్డు వేశాడు. హత్యకు గురైన వారి సెల్‌లో వేరొకరి సిమ్‌ వేసినట్లు పోలీసులకు సాంకేతిక ఆధారం లభించడంతో.. లొకేషన్‌ ఆరా తీసి నిజామాబాద్‌ ఖిల్లా చౌరస్తాలో నిందితుడిని పట్టుకున్నారు. దర్యాప్తులో తానే హత్యలు చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడు. అతని నుంచి మృతుల సెల్‌ఫోన్లు, కొంత నగదుని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 2018లో ఓ దొంగతనం కేసులో అరెస్టయిన శ్రీకాంత్‌ను పోలీసులు అప్పట్లో బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. నిందితుడి కుటుంబసభ్యుల వివరాలు వెల్లడికాలేదు. అతడు నెల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు