AP News: బాలికను గర్భవతిని చేసిన బాలుడి అరెస్టు

తాజంగి పంచాయతీ బోయపాడు గ్రామంలో ఓ బాలికను అదే గ్రామానికి చెందిన బాలుడు గర్భవతిని చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన

Updated : 21 Dec 2021 06:58 IST

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: తాజంగి పంచాయతీ బోయపాడు గ్రామంలో ఓ బాలికను అదే గ్రామానికి చెందిన బాలుడు గర్భవతిని చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం బాలుడ్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయపాడుకు చెందిన బాలిక (15) తొమ్మిదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. గ్రామానికి చెందిన బాలుడు (17) ఇంటరు పూర్తి చేసి గ్రామంలో ఉంటున్నాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి దగ్గరయ్యారు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు నెల రోజుల కిందట నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఎనిమిది నెలల గర్భిణి అని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బాలుడ్ని అరెస్టు చేసి జువెనైల్‌ హోంకి తరలించినట్లు ఎస్సై అలీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు