TS News: ఎంత పని చేశావమ్మా..

భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. భర్తపై కోపంతో ఒకటిన్నరేళ్ల వయసున్న కుమారుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన తల్లి.. తానూ నిప్పంటించుకుంది. మంటల్లో ఇద్దరూ సజీవదహనమయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సిద్దిపేట ...

Updated : 26 Dec 2021 08:50 IST

ఇద్దరి ప్రాణాలు తీసిన దంపతుల గొడవ

కొండపాక, న్యూస్‌టుడే: భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. భర్తపై కోపంతో ఒకటిన్నరేళ్ల వయసున్న కుమారుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన తల్లి.. తానూ నిప్పంటించుకుంది. మంటల్లో ఇద్దరూ సజీవదహనమయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సిద్దిపేట త్రీ టౌన్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ సంపత్‌కుమార్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గవ్వల స్వామి, నవిత(27)లది వ్యవసాయ కుటుంబం. వారికి మూడేళ్ల క్రితం వివాహమైంది. నవిత స్వామికి స్వయానా అక్క కూతురు. వారికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు మణిదీప్‌ ఉన్నాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం కూడా వారు ఘర్షణ పడ్డారు. ఉదయం కుమారుడిని గవ్వల స్వామి ఎత్తుకుని ఆడించి నిద్రపుచ్చాడు. ఆ తర్వాత నిద్రిస్తున్న భార్య పక్కన పడుకోబెట్టి పొలానికి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో నుంచి పొగ వస్తుండటాన్ని గమనించిన చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా.. తల్లీకుమారులు మంటల్లో కాలిపోతూ కన్పించారు. సమాచారం అందుకున్న స్వామి ఇంటికి చేరుకుని.. మంటల్లో కాలిపోయిన భార్య, కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదించాడు. భర్త వేధింపులు తాళలేక కుమారుడి సహా నవిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని