AP News: యూబీఐకు రూ.228 కోట్ల కుచ్చుటోపీ.. కేసు నమోదు చేసిన సీబీఐ

‘యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’కు రూ.228.02 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన నిందితులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలను గురువారం విశాఖలో మీడియాకు విడుదల చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ

Published : 07 Jan 2022 07:11 IST

యూబీఐ ఫిర్యాదుతో వెలుగులోకి..

ఈనాడు, విశాఖపట్నం: ‘యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’కు రూ.228.02 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన నిందితులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలను గురువారం విశాఖలో మీడియాకు విడుదల చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ, దాని ఛైర్మన్‌, ఐదుగురు డైరెక్టర్లు, మరో రెండు సంస్థలు, కొందరు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కొందరు ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఓ ప్రైవేటు సంస్థ, దాని డైరెక్టర్లు కొందరితో కలసి కుట్రచేసి, తప్పుడు పత్రాలను బ్యాంకుకు సమర్పించి అక్రమ మార్గాల్లో రుణాలు పొందినట్లు విశాఖపట్నం యూబీఐ నుంచి తమకు ఫిర్యాదు అందిందని సీబీఐ అధికారులు తెలిపారు. ఆ రుణాలను దారి మళ్లించడంతో బ్యాంకుకు రూ.228.02 కోట్లు నష్టం కలిగిందని వివరించారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రకాశం జిల్లా సహా 8 చోట్ల సోదాలు నిర్వహించి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని