TS News: ఎందుకెళ్లారో.. ఎలా చనిపోయారో!
హైదరాబాద్‌లో పని చేసుకుంటామని వెళ్లిన మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన యువకులు బిహార్‌లో మృతి చెందడంతో
బిహార్, యూపీలో నలుగురు తెలంగాణ యువకుల మృతి
ఈనాడు డిజిటల్- మహబూబ్‌నగర్, న్యూస్‌టుడే- భూత్పూరు, ఖిల్లాగణపురం: హైదరాబాద్‌లో పని చేసుకుంటామని వెళ్లిన మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన యువకులు బిహార్‌లో మృతి చెందడంతో కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు పురపాలిక పరిధిలోని వివిధ తండాలకు చెందిన కేతావత్ వెంకటేశ్ (25), పాల్త్యావత్ వినోద్(23), శ్రీను(23), సంతోష్ స్నేహితులు. వీరు బీమా సంస్థల్లో ఉద్యోగం చేసేందుకని చెప్పి కొద్ది నెలల కిందట హైదరాబాద్ వెళ్లారు. రెండు వారాల కిందట తండాలకు తిరిగివచ్చి.. ఈ నెలారంభంలో మళ్లీ వెళ్లారు. వారిలో వెంకటేశ్, వినోద్, శ్రీనులు పట్నాలో ఆదివారం మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులకు మంగళవారం సమాచారం వచ్చింది. సంతోష్ వివరాలు తెలియడం లేదు. కల్తీ మద్యం తాగడం వల్లే ముగ్గురు చనిపోయారని వైద్యుడు వెల్లడించినట్లు ఫోన్ ద్వారా సమాచారమిచ్చిన వ్యక్తి తెలిపారు. మరోఘటనలో వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం కొత్తపల్లి తండాకు చెందిన అవినాష్(26) రైలులో మృతి చెందినట్లు అతని సోదరుడు భాస్కర్‌కు సోమవారం అర్ధరాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లో కానిస్టేబుల్‌నని చెప్పుకొన్న వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అవినాష్ కూడా భూత్పూరుకు చెందిన యువకులతోనే కలిసి బిహార్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్థిక నేరాలకు చెందిన ముఠా బీమా రంగంలో ఉద్యోగాల పేరిట వీరిని బిహార్ తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్