రూ.25 లక్షలు నా ఖాతాకు పంపండి

‘నాపేరు అభిషేక్‌. తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలోని పారిశ్రామిక విభాగంలో పనిచేస్తున్నా. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌(కేవీఐసీ) తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి రూ.ఐదు కోట్ల విలువైన 20 సబ్సిడీ

Published : 15 Jan 2022 04:26 IST

రూ.5 కోట్ల విలువైన సబ్సిడీ రుణాల యూనిట్లు మంజూరయ్యాయి
సీఎంవో నుంచంటూ తిరుపతి ఎంపీకి నకిలీ కాల్‌.. కేసు నమోదు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: ‘నాపేరు అభిషేక్‌. తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలోని పారిశ్రామిక విభాగంలో పనిచేస్తున్నా. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌(కేవీఐసీ) తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి రూ.ఐదు కోట్ల విలువైన 20 సబ్సిడీ రుణాల యూనిట్లు మంజూరు చేసింది. ఒక్కో యూనిట్‌కు రూ.1.25 లక్షల చొప్పున మొత్తం రూ.25 లక్షలు నా ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయండి. ఆ తర్వాత దరఖాస్తుదారుడి సెల్‌ఫోన్‌ నంబరుకు ఉత్తర్వులు పంపుతా’ అని తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తికి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఫోన్‌ వచ్చింది. అనుమానంతో ఎంపీ ఆ విభాగంలో ఆరా తీయగా అభిషేక్‌ అనే వ్యక్తి లేడని నిర్ధారణైంది. ఫోన్‌ కాల్‌పై దర్యాప్తు చేయాలని పీఏ ద్వారా ఎస్పీ వెంకట అప్పలనాయుడుకి శుక్రవారం ఫిర్యాదు చేశారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు