పంట నష్టం.. యువరైతు బలవన్మరణం

పంట నష్టాన్ని భరించలేక ఇటీవల పురుగుల మందు తాగిన ఓ యువరైతు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలో ఈ సంఘటన

Published : 18 Jan 2022 04:21 IST

రాయపర్తి, న్యూస్‌టుడే: పంట నష్టాన్ని భరించలేక ఇటీవల పురుగుల మందు తాగిన ఓ యువరైతు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలో ఈ సంఘటన జరిగింది. రాయపర్తి ఎస్సై బి.రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటేశ్వరపల్లికి చెందిన మహేందర్‌ (25) రెండెకరాల్లో మిర్చి, ఎకరం చొప్పున వరి, పత్తి పంటలు సాగు చేశారు. ఇటీవల వడగళ్లతో భారీ వర్షం కురవగా ఈ నెల 15న పంటలను పరిశీలించడానికి పొలం వద్దకు వెళ్లారు. వడగళ్లు, భారీ వర్షానికి మిర్చి పంట పూర్తిగా నేలమట్టమైంది. పంటకు నష్టం వాటిల్లడంతో అప్పులు ఎలా తీర్చాలన్న ఆందోళన చెందిన మహేందర్‌ అదే రోజు పొలంలో పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు, ఇతర రైతులు హుటాహుటిన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. మహేందర్‌ భార్య లావణ్య ఫిర్యాదు మేరకు   కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని