ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మూడో నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌

Published : 19 Jan 2022 04:25 IST

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మూడో నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. ఇదే కేసులో ఐదో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల కొట్టేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ కోర్టు దస్త్రాల్లోకి చేరకపోవడంతో విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. న్యాయవాది కె.చిదంబరం వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ను ఇప్పటికే కస్టడీలో విచారించారన్నారు. దర్యాప్తు పూర్తయినందున బెయిలు మంజూరు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని