అతివేగం తెచ్చిన అనర్థం:గోడపైకి ఎక్కి.. విద్యుత్తు స్తంభానికి వాలి..

అతివేగంతో దూసుకెళ్లిన ఓ కారు విద్యుత్తు స్తంభం పై భాగాన్ని తాకింది. వాహన చోదకుడు నిద్రమత్తులో ఉండటంతో పాటు కారును వేగంగా నడపడంతో రోడ్డును ఆనుకుని ఉన్న

Updated : 21 Jan 2022 08:49 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అతివేగంతో దూసుకెళ్లిన ఓ కారు విద్యుత్తు స్తంభం పై భాగాన్ని తాకింది. వాహన చోదకుడు నిద్రమత్తులో ఉండటంతో పాటు కారును వేగంగా నడపడంతో రోడ్డును ఆనుకుని ఉన్న రక్షణ గోడకు ఢీకొని  గోడకు... విద్యుత్తు స్తంభానికి మధ్య ఇరుక్కుపోయింది. విశాఖ జిల్లా వెంకటాపురం-రాంబిల్లి రోడ్డులోని మోటూరుపాలెంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. కారులో ఒక్కరే వాహనంలో ఉండటం.. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆవు మృతి చెందడంతో రూ.30 వేలు పరిహారం అందించినట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదు అందలేదని అచ్యుతాపురం ఎస్సై ఉపేంద్ర తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని