ఇద్దరు రైతుల బలవన్మరణం

పంటలు దెబ్బతినడంతో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు కౌలురైతు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 21 Jan 2022 05:40 IST

మిర్యాలగూడ, నర్మెట్ట, న్యూస్‌టుడే: పంటలు దెబ్బతినడంతో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు కౌలురైతు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ కాలనీకి చెందిన కట్టెబోయిన లింగయ్య (56)కు రూ.3 లక్షల వరకు అప్పు ఉంది. ఖరీఫ్‌లో మాదిరిగానే రబీలో సైతం కౌలుకు తీసుకుని ఏడెకరాల్లో వరి సాగు చేశారు. గురువారం పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. పొలం ఆశించినంత ఎదగకపోతుండటంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకొని బలన్మరణానికి పాల్పడ్డారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

జనగామ జిల్లా నర్మెట్ట మండలం అమర్‌సింగ్‌ తండాలో రైతు తేజావత్‌ లచ్చిరాం(51) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రెండెకరాల్లో పుచ్చతోట సాగు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగారు. జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని