Updated : 21 Jan 2022 07:33 IST

హయత్‌నగర్‌లో దారుణం.. పసికందుపై శానిటైజర్‌ పోసి నిప్పు

తనూ ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి
8 రోజుల అనంతరం బాలుడి మృతి

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవకు ముక్కుపచ్చలారని పసివాడు బలయ్యాడు. నవమాసాలు మోసి కన్న కొడుకును అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లే క్షణికావేశంలో బాలుడి పాలిట మృత్యువైంది. హృదయ విదారకరమైన ఈ సంఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని ముస్తాపలి గ్రామం రాజ్యతండాకు చెందిన రమావత్‌ వెంకటేష్‌తో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బొడకొండ తండాకు చెందిన రమావత్‌ సువర్ణ (30)కు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. హయత్‌నగర్‌లో నివసిస్తున్న వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కన్నయ్య (7 నెలలు) ఉన్నారు. తరచూ కీచులాడుకునే దంపతులు ఈ నెల 11న గొడవ పడ్డారు. మనస్తాపానికి గురైన సువర్ణ భర్త బయటకు వెళ్లిన సమయంలో బాలుడితోపాటు తనపై శానిటైజర్‌ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లోంచి ఏడుపులు, కేకలు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలార్పారు. గాయపడిన తల్లిని, కుమారుడిని హయత్‌నగర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. బాలుడి పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారం రోజులపాటు మృత్యువుతో పోరాడిన పసివాడు బుధవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సువర్ణ కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. బాలుడి నాయనమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని