సీఎంను చంపుతానన్న వ్యక్తి అరెస్టు

మానవబాంబునై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని చంపేస్తానన్న వ్యక్తిని ఏపీ సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాజమండ్రికి చెందిన రాజుపాలెపు పవన్‌ ఫణి  సామాజిక మాధ్యమాల్లో జగన్‌ను చంపేస్తానని

Published : 22 Jan 2022 05:03 IST

సీఐడీ సైబర్‌ క్రైం ఎస్పీ రాధిక వెల్లడి

ఈనాడు, అమరావతి: మానవబాంబునై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని చంపేస్తానన్న వ్యక్తిని ఏపీ సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాజమండ్రికి చెందిన రాజుపాలెపు పవన్‌ ఫణి  సామాజిక మాధ్యమాల్లో జగన్‌ను చంపేస్తానని వివాదాస్పద పోస్టింగ్‌లు పెట్టారని సీఐడీ సైబర్‌ క్రైం ఎస్పీ రాధిక తెలిపారు. గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో నిందితుడి వివరాలను శుక్రవారం ఆమె మీడియాకు వెల్లడించారు. కన్నాభాయ్‌ అనే ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా పవన్‌ ఫణి శాంతిభద్రతల సమస్యలు వచ్చేలా ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.  ‘గురువారం హైదరాబాద్‌లో ఉండగా అతడిని అదుపులోకి తీసుకున్నాం. ఇతను జనసేన మద్దతుదారు, పవన్‌కల్యాణ్‌ అభిమాని అని వాంగ్మూలం ఇచ్చారు. సేల్స్‌మెన్‌గా పనిచేస్తారు...’ అని చెప్పారు.

ఆ వ్యక్తితో జనసేనకు సంబంధం లేదు
ఈనాడు, అమరావతి: ‘‘సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు ప్రచారం చేసే వారిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదు. ముఖ్యమంత్రిని చంపుతానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తితో జనసేనకు ఎలాంటి సంబంధం లేదు. హింసను ప్రోత్సహించే, అశాంతిని కలిగించే, అసభ్యకర వ్యాఖ్యానాలు ఉండే పోస్టులను పార్టీ ఎప్పుడూ ఖండిస్తుంది....’’ అని జనసేన శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పార్టీ సానుభూతిపరుడు, పార్టీ అధ్యక్షుడి అభిమాని, అనే ముసుగులో తప్పుడు ప్రచారం చేసే వారి విషయంలో జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని