దుర్భాషలాడారు.. వస్త్రాలూ లాగారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాకివాగు అటవీ ప్రాంతంలో కట్టెల కోసం వెళ్లిన తమతో స్థానిక అటవీ అధికారి అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు వస్త్రాలు లాగారని ఆదివాసీ మహిళలు కొందరు ఆరోపించడం

Published : 22 Jan 2022 05:04 IST

అటవీ అధికారిపై ఆదివాసీ మహిళల ఆరోపణలు

ఈటీవీ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాకివాగు అటవీ ప్రాంతంలో కట్టెల కోసం వెళ్లిన తమతో స్థానిక అటవీ అధికారి అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు వస్త్రాలు లాగారని ఆదివాసీ మహిళలు కొందరు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. బాధితులు, న్యూడెమొక్రసీ పార్టీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. సాకివాగు గొత్తికోయగూడేనికి చెందిన నలుగురు మహిళలు గురువారం మధ్యాహ్నం కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఫారెస్ట్‌ బీట్‌ అధికారి మహేశ్‌ వారిని చూసి.. అడవిలోకి ఎందుకు వచ్చారంటూ తరిమేశారు. నలుగురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడారు. ఒకరిపై చేయి చేసుకోగా మరో ముగ్గురు పారిపోయే ప్రయత్నం చేశారు. వీరిలో ఓ మహిళ వస్త్రాలను అధికారి లాగటంతో ఆమె సర్దుకుని పారిపోయింది. మరో మహిళ గుంతలో పడి గాయపడగా మిగిలినవారు ఆమెను గ్రామానికి తీసుకెళ్లారు. మండలానికి చెందిన న్యూడెమొక్రసీ పార్టీ నాయకులు శుక్రవారం ఆ గ్రామానికి వెళ్లగా బాధితులు గోడు వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనను న్యూడెమొక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ముల్కలపల్లి అటవీశాఖ అధికారి రవికిరణ్‌ను వివరణ కోరగా, అటవీ ప్రాంతానికి వచ్చిన కొంతమందిని కట్టెలు కొట్టవద్దని మహేశ్‌ హెచ్చరించిన మాట వాస్తవమేన్నారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని