Published : 23 Jan 2022 05:12 IST

ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా గంగలూరు అటవీ ప్రాంతంలో కొంతమంది మావోయిస్టులు ఓ వ్యక్తిని శనివారం దారుణంగా హత్య చేశారు. బీజాపూర్‌ ప్రాంతానికి చెందిన ఆందో పోయం(45)ను పోలీసులు ఇన్‌ఫార్మర్‌ (సీక్రెట్‌ సోల్జర్‌)గా నియమించుకున్నారు. ఇతడిని శుక్రవారం రాత్రి సమయంలో 10 మంది మావోయిస్టులు అపహరించి అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లారు. పోలీసులకు సమాచారం చేరవేస్తూ ఉద్యమాన్ని దెబ్బతీస్తున్నావంటూ చితకబాదారు. పదునైన ఆయుధాలతో పీక కోసి దారుణంగా హత్య చేశారు. అతడి మృతదేహాన్ని గంగలూరు రహదారికి సమీపంలోని సీఆర్పీఎఫ్‌ శిబిరం ప్రాంతంలో పడేశారు. ఈ సంఘటన వివరాలను బీజాపూర్‌ ఎస్పీ కమలోచన్‌ కశ్యప్‌ ధ్రువీకరించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని