బహుళ అంతస్తుల భవనంలో అగ్ని కీలలు

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని శనివారం ఉదయం 20 అంతస్తుల నివాస భవనంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 23 మంది గాయాలతో నగరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Published : 23 Jan 2022 05:14 IST

ముంబయిలో ఆరుగురి మృతి 

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని శనివారం ఉదయం 20 అంతస్తుల నివాస భవనంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 23 మంది గాయాలతో నగరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉదయం 7 గంటల సమయంలో తాడ్‌దేవ్‌ ప్రాంతంలోని సచినమ్‌ హైట్స్‌లోని 19వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. నల్లటి దట్టమైన పొగలు అలుముకున్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రాణభయంతో అపార్ట్‌మెంట్‌ వాసులు పరుగులు తీశారు. కొందరు మంటల్లో చిక్కుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని రక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని