కాడెద్దే ప్రాణం తీసింది

పంట సాగులో నిత్యం తనకు సహకరిస్తూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కాడెద్దు ఆ అన్నదాత మృత్యువుకు కారణమైంది. ఎద్దు పొడవడంతో రైతు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం ఉదయం నల్గొండ జిల్లా నాంపల్లి

Published : 24 Jan 2022 04:33 IST

నాంపల్లి, న్యూస్‌టుడే: పంట సాగులో నిత్యం తనకు సహకరిస్తూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కాడెద్దు ఆ అన్నదాత మృత్యువుకు కారణమైంది. ఎద్దు పొడవడంతో రైతు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం ఉదయం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం దామెరలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మండల బుగ్గయ్య(40) తనకున్న 11  ఎకరాల భూమిలో పత్తి సాగు చేస్తున్నారు. రోజు మాదిరిగా ఆదివారం ఉదయం వ్యవసాయ పొలంవద్ద ఉన్న పత్తిని తీసుకొచ్చేందుకు ఎడ్ల బండిపై బయలుదేరారు. పొలం వద్ద పశువులను మేతకు వదిలి పత్తిని బండిలో నింపుతున్న క్రమంలో అతడిని ఎద్దు పొడిచింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి రాకపోవడంతో జాడ కోసం వెళ్లిన చిన్న కుమార్తె విషయం గమనించి స్థానికులకు సమాచారం అందించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై ఆదివారం రాత్రి వరకు ఫిర్యాదు అందలేదని ఎస్సై కె.రజినీకర్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని