
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కేసముద్రం, న్యూస్‌టుడే: పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన భూక్యా వెంకన్న(41)కు మూడు ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. ఈ ఏడాది రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇందుకోసం సుమారు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టారు. తామర పురుగుతో పాటు అకాల వర్షాలతో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆయనకు సాగు కోసం చేసిన అప్పులతో పాటు ఇతర అప్పులు రూ.5 లక్షలున్నాయి. వీటిని తీర్చే మార్గం కనిపించక కొద్దికాలంగా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఈ క్రమంలోనే వెంకన్న శనివారం పంట చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన తండావాసులు ఆయన్ను వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మృతుడి భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్‌బాబు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.