Published : 25 Jan 2022 04:58 IST

సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని అంజిరెడ్డి సినిమా థియేటర్‌లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఆట ప్రారంభమైన అరగంటలోనే థియేటర్‌ వరండాలో మంటలు చెలరేగడంతో లోపల దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో 50 మంది వరకు సినిమా చూస్తున్నారు. మంటలు, పొగ వ్యాపించడాన్ని గమనించిన ప్రేక్షకులు తలుపులు తెరుచుకుని బయటకు పరుగులు తీశారు. థియేటర్‌ సిబ్బంది అక్కడి గోడలకు అమర్చిన అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అవి పని చేయలేదు. అక్కడికి చేరుకున్న ఎస్సై నాగిరెడ్డి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఆ శకటం చిట్యాల మండలంలో ఉన్నట్టు సమాధానం వచ్చింది. దీంతో థియేటర్‌ సిబ్బంది బాత్‌రూంలోని నీళ్లను బకెట్లతో తెచ్చి చల్లి మంటలు ఆర్పేశారు. థియేటర్‌ లోపలికి మంటలు వ్యాపించి ఉంటే భారీగా నష్టం జరిగి ఉండేది. రెవెన్యూ శాఖ గిర్దావర్‌ సుధాకర్‌రావు ప్రమాదస్థలానికి వచ్చి పంచనామా నిర్వహించారు. తహసీల్దార్‌ దశరథకు నివేదిక సమర్పించారు. ఈ ప్రమాదంపై ఫిర్యాదు నమోదు కాలేదని ఎస్సై నాగిరెడ్డి తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని