అందరికీ ధైర్యం చెప్పి.. తాను కోల్పోయి: వ్యక్తిత్వ వికాస నిపుణుడి బలవన్మరణం

అతనో సమాజ ప్రేమికుడు.. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించేవాడు. మంచిని పది మందికి చెప్పేవాడు. స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఆకట్టుకునేవాడు.. అలాంటి వ్యక్తి అనారోగ్య సమస్యలపై పోరాడలేకపోయాడు.. అర్ధంతరంగా తనువు చాలించాడు.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్‌కు చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు కాసాల జైపాల్‌రెడ్డి (34) సోమవారం నిజాంసాగర్‌ జలాశయంలో పడి మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారని పోలీసులు తెలిపారు.

Updated : 25 Jan 2022 07:47 IST

నిజాంసాగర్‌, న్యూస్‌టుడే: అతనో సమాజ ప్రేమికుడు.. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించేవాడు. మంచిని పది మందికి చెప్పేవాడు. స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఆకట్టుకునేవాడు.. అలాంటి వ్యక్తి అనారోగ్య సమస్యలపై పోరాడలేకపోయాడు.. అర్ధంతరంగా తనువు చాలించాడు.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్‌కు చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు కాసాల జైపాల్‌రెడ్డి (34) సోమవారం నిజాంసాగర్‌ జలాశయంలో పడి మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారని పోలీసులు తెలిపారు.

ఏడు వేలకుపైగా ప్రసంగాలు: కరోనా వ్యాప్తికి ముందు జైపాల్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. కళాశాలలు, పాఠశాలలు, పలు వేదికల్లో ఏడు వేలకుపైగా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. విద్యార్థులు, యువతకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. జైపాల్‌రెడ్డి కుటుంబానికి స్వగ్రామంలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తల్లిదండ్రులు అంజవ్వ, ఆగంరెడ్డి. వీరికి రమాదేవి, జనార్దన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి సంతానం. అక్క, అన్నలకు వివాహాలు అయ్యాయి.చిన్నవాడైన జైపాల్‌రెడ్డి అవివాహితుడు. ఎంసీఏ చదివారు.అందరితో కలివిడిగా ఉండేవారంటూ.. ఆయన బలవన్మరణంపై గ్రామస్థులు కంటతడి పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని