హత్య కేసులో సైకో మునస్వామికి జీవితఖైదు

బంగారు నగల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం చిత్తూరు ఆరో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు చెప్పారు. ఏపీపీ నిర్మల కథనం ప్రకారం...

Published : 26 Jan 2022 05:07 IST

చిత్తూరు (న్యాయవిభాగం), పాలసముద్రం, న్యూస్‌టుడే: బంగారు నగల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం చిత్తూరు ఆరో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు చెప్పారు. ఏపీపీ నిర్మల కథనం ప్రకారం... చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం గంగమాంబపురం పంచాయతీ అప్పిరాజుకండ్రిగ గ్రామానికి చెందిన వళ్లియమ్మ(68) ఒంటరిగా ఇంట్లో ఉంటోంది. 2018 మార్చి 9న రాత్రి గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి.. మెడలోని తాళిబొట్టు, ఇతర బంగారు నగలు దోచుకెళ్లారు. అప్పటి సీఐ ఆదినారాయణ పర్యవేక్షణలో పాలసముద్రం పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టి తమిళనాడు రాష్ట్రం వాలాజ తాలూకా మట్టంగల్‌ గ్రామానికి చెందిన మునస్వామి(47)ని అరెస్టు చేసి విచారించగా.. నగల కోసం హత్య చేసినట్లు నిర్ధారణైంది. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఇలాంటి దాదాపు పది కేసుల్లో నిందితుడని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. సైకో మునస్వామిగా అప్పట్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు