పెళ్లికి ముందే ‘కల్యాణలక్ష్మి’..ఆధార్‌ నంబరుతో డబ్బులు కాజేసిన అక్రమార్కులు

ఆమెకు వివాహం జరిగింది 2021 ఏప్రిల్‌ నెలలో.. కానీ ఆమెకు కల్యాణ లక్ష్మి నిధులు విడుదలైంది మాత్రం 2018లోనే. ఆశ్చర్యంగా ఉన్నా ఇచ్చోడ మండలం బావోజిపేట్‌ గ్రామానికి చెందిన ఏత్మాబాయికి ఈ పరిస్థితి ఏర్పడింది. ఆమెకు ఇదే గ్రామానికి చెందిన మెస్రం

Published : 26 Jan 2022 07:19 IST

లబోదిబోమంటున్న అసలు లబ్ధిదారురాలు

ఇచ్చోడ, న్యూస్‌టుడే: ఆమెకు వివాహం జరిగింది 2021 ఏప్రిల్‌ నెలలో.. కానీ ఆమెకు కల్యాణ లక్ష్మి నిధులు విడుదలైంది మాత్రం 2018లోనే. ఆశ్చర్యంగా ఉన్నా ఇచ్చోడ మండలం బావోజిపేట్‌ గ్రామానికి చెందిన ఏత్మాబాయికి ఈ పరిస్థితి ఏర్పడింది. ఆమెకు ఇదే గ్రామానికి చెందిన మెస్రం ఉత్తంతో 2021 ఏప్రిల్‌లో వివాహమైంది. ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకం కోసం ఇటీవల దరఖాస్తు చేసేందుకు ఇచ్చోడకు వెళ్లగా.. ఇది వరకే ఆమె ఆధార్‌ నంబరుపై కల్యాణలక్ష్మి నిధులు తీసుకున్నట్లు చూపించడంతో అవాక్కయ్యారు. దీంతో పూర్తి వివరాలు ఆరా తీయగా.. 2018లోనే ఆమె ఆధార్‌పై నేరడిగొండ మండలం కుప్టి గ్రామానికి చెందిన నిఖిత అనే మహిళ పేరుమీద కల్యాణలక్ష్మి నిధులు మంజూరైనట్లు చూపించింది. జిల్లాలోనే కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ కుంభకోణం 2020లో సంచలనంగా మారిన విషయం విదితమే. ఇదే అక్రమాల్లో ఏత్మాబాయి ఆధార్‌ నంబరుపై నిధులు స్వాహా చేయడంతో ఆమె లబోదిబోమంటున్నారు. తమకు తెలియకుండానే తమ ఆధార్‌ నంబరుతో నిధులు కాజేశారని, అధికారులు దృష్టి సారించి తమకు ప్రభుత్వ పథకం అందేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై ఇచ్చోడ డిప్యూటీ తహసీల్దార్‌ రామారావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా బాధితులు తమకు ఫిర్యాదు చేశారని, ఈ సమస్యను జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని