కల్తీ పాల ఉత్పత్తుల గుట్టు రట్టు

పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామికవాడ కేంద్రంగా సాగుతున్న కల్తీ పాలు, పాల ఉత్పత్తుల తయారీ గుట్టు బట్టబయలైంది. గత ఏడాదిగా రోజుకు వేలాది లీటర్ల కల్తీ ఉత్పత్తులను, ప్రముఖ బ్రాండ్ల పేర్లను ఉపయోగించి హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో భారీ

Published : 26 Jan 2022 05:07 IST

పటాన్‌చెరులో పోలీసుల దాడులు

ఈనాడు- హైదరాబాద్‌, పటాన్‌చెరు- న్యూస్‌టుడే: పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామికవాడ కేంద్రంగా సాగుతున్న కల్తీ పాలు, పాల ఉత్పత్తుల తయారీ గుట్టు బట్టబయలైంది. గత ఏడాదిగా రోజుకు వేలాది లీటర్ల కల్తీ ఉత్పత్తులను, ప్రముఖ బ్రాండ్ల పేర్లను ఉపయోగించి హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో భారీ ఎత్తున పవిత్ర మిల్క్‌ డెయిరీ సంస్థ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం పారిశ్రామికవాడలో పటాన్‌చెరు డీఎస్పీ భీంరెడ్డి బృందం నిర్వహించిన దాడుల్లో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడి ఉత్పత్తులను సీజ్‌ చేసి.. పవిత్ర మిల్క్‌ డెయిరీ మేనేజరు ప్రసాదరావును అరెస్టు చేశారు.

కంపెనీల లేబుళ్లు అతికించి...

పాశమైలారంలో మూతపడిన పరిశ్రమను వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అద్దెకు తీసుకుని పవిత్ర మిల్క్‌ ప్రొడక్ట్‌ పేరుతో పాలు, పాల ఉత్పత్తుల తయారీ ప్రారంభించాడు. ఇక్కడ టన్నుల కొద్దీ పాల పౌడరు, రసాయనాలను నిల్వ చేసి.. పాలు, పెరుగు తయారీ ప్రారంభించాడు. 10 ప్రముఖ సంస్థల లేబుళ్లను తమ ఉత్పత్తులకు అతికించి వాటిని బేగంబజార్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్‌, అబిడ్స్‌ ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నాడు. రోజూ 10,000-12,000 పాలు, 100-200 టన్నుల పెరుగు, ఇతర ఉత్పత్తులను మార్కెట్‌కు చేరవేస్తున్నట్లు తేలింది. గతేడాది కేటరింగ్‌ సంస్థలకు భారీగా పాలు, పెరుగు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. కొద్ది సమయంలోనే ప్రతిరోజూ 15,000 లీటర్ల పాలు, 500 టన్నుల పెరుగును సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. 6,000 లీటర్ల పాలు, పెరుగును సీజ్‌ చేసి.. పన్నీర్‌, పాల పౌడర్‌ స్వాధీనం చేసుకున్నారు. తాము రైతుల నుంచి పాలను సేకరిస్తున్నామని, తాము కల్తీ చేయలేదని పోలీసులతో డెయిరీ యాజమాన్యం వాదించినట్లు తెలియవచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు